పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి :

కట్టంగూర్, జ్ఞాన తెలంగాణ, సెప్టెంబర్ 26 : గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్. పద్మావతి అన్నారు. శనివారం మండలంలోని పిట్టంపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కే. ఇంద్రకుమారీ, ఇంద్ర, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...