చలో జాజాల.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక

వంగూర్ సెప్టెంబర్ 25: అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్ జీలకర్ర కాశమ్మకు సంఘీభావం తెలిపేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం పర్యటించనున్నారు. ఈనెల 26న శనివారం ఉదయం 9 గంటలకు వంగూరులో నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ‘చలో జాజాల’ కార్యక్రమంలో పాల్గొంటారు. సర్పంచ్ కాశమ్మకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మండల నాయకులు పిలుపునిచ్చారు.1001211385.jpg

You may also like...