ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక

ఉమ్మడి నల్లగొండ జిల్లా  హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 25 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లా అండర్-14,17 బాల, బాలికల హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక పక్రియను శుక్రవారం హెచ్ఎం కందాల రమా సారధ్యంలో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చిలుముల సైదులు క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతకామల పుల్లయ్య తెలిపారు. ఎంపికైనా క్రీడాకారులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడల కన్వీనర్లు తాళ్ల శ్రీనివాస్, నంద్యాల రాజశేఖర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు రఘువీర్ సింగ్, వెంకన్న, చైతన్య, రాజ్యలక్ష్మి, శ్రీనివాస్ రావు, యాదయ్య, కేశవనాగులు, పాఠశాల ఉపాధ్యాయులు రాంమోహన్ రెడ్డి, శ్రీనివాస్, కోటిలింగం, నరహరి, నగేష్, లింగయ్య, సంపత్ కుమార్, సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

You may also like...