ఆర్ టి ఐ జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి కోనాపూర్ వడ్ల శివరాం శ్రీను ఎంపిక

IMG-20260925-WA0074.jpg

బాన్సువాడ: సమాచార హక్కు చట్టం-2005 అమలు కోసం కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినా జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త పడ్ల శివరాం శ్రీను పేరును బాన్సువాడ ఆర్డీవో సిఫార్సు చేశారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రవీందర్ రెడ్డి లేఖ నం. F/2093/2026 ద్వారా కలెక్టర్ కు ప్రతిపాదన పంపారు. 4 ఏళ్లుగా ఆర్టీఐ రంగంలో అనుభవం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి చేతుల మీదుగా నియమాక పత్రాన్ని అందుకున్నారు. ఈసందర్భంగా వడ్ల శివరాం శ్రీను మాట్లాడుతూ ఈ కమిటీ జిల్లాలో ఆర్టీఐ చట్టం అమలును పర్యవేక్షిస్తుందని అన్నారు. మరియు ఆర్టీఐ చట్టం గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పిస్తానని అన్నారు. నాకు పూర్తి స్థాయిలో సహకరించిన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ (సెకండ్ క్లాస్ మాజీ న్యాయమూర్తి) ఎం. ఎ సలీం గారికి కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...