వైద్య సీటు సాధించినా పేదరికమే అడ్డు – 1 లక్షతో అండగా నిలిచిన సింగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి
- వైద్య సీటు సాధించినా పేదరికమే అడ్డు – 1 లక్షతో అండగా నిలిచిన సింగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి - September 25, 2026
- ప్రజా ఆరోగ్య పరిరక్షణకు.. ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛ జలధార - September 25, 2026
- గూడు లేని నిరుపేదలకు ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం - September 25, 2026

వెల్దండ: పేదరికం అడ్డొచ్చినా పట్టుదలతో నీట్‌లో అర్హత సాధించి వైద్య సీటు పొందిన నిరుపేద విద్యార్థిని సరితకు టాస్క్ సీఓఓ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆర్థిక అండగా నిలిచారు.వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్–అలివేలు దంపతుల కుమార్తె సరిత ఇటీవల నీట్ పరీక్షలో అర్హత సాధించి మహబూబాబాద్ వైద్య కళాశాలలో సీటు పొందారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య విద్య కొనసాగించడం కష్టంగా మారిన విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న రాఘవేందర్‌రెడ్డి స్పందించారు. శుక్రవారం సరిత ఇంటికి వెళ్లి రూ.లక్ష చెక్కును అందజేసి కుటుంబానికి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్న ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటే, వారు భవిష్యత్తులో వంద కుటుంబాలకు వెలుగునిచ్చే స్థాయికి ఎదుగుతారని అన్నారు. కడుపు నిండితే వచ్చే బలం కంటే.. కడుపు కాలితే వచ్చే పట్టుదల గొప్పదని సరిత నిరూపించిందన్నారు. ఆసక్తి, పట్టుదల ఉంటే ఏ శక్తీ మనల్ని ఆపలేదని సరిత తన విజయంతో నిరూపించిందని పేర్కొన్నారు.అనంతరం సరిత మాట్లాడుతూ.. తన కుటుంబంలో పలువురు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందారని తెలిపారు. తాను వైద్యురాలిగా స్థిరపడి, తన కుటుంబానికి ఎదురైన పరిస్థితి మరే కుటుంబానికీ రాకుండా చూడాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు కొండల్ యాదవ్, ఐక్యత ఫౌండేషన్ కడ్తాల్ అధ్యక్షులు శ్రీరామ్, చంద్రశేఖర్, పంతుల నాయక్, రాహుల్ నాయక్, లాలు నాయక్‌తో పాటు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
