కొట్ర తండా కూడలిలో పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు

1001334461.jpg

వెల్దండ నవంబర్ 06: వెల్దండ మండలం కొట్ర తండా ప్రధాన కూడలిలో గురువారం రాత్రి పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. సీఐ రఘువీర్ రెడ్డి, ఇన్‌చార్జి ఎస్సై వీరబాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.ఈ సందర్భంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్లు, హెల్మెట్, సీట్ బెల్ట్ తదితర అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.అనుమానాస్పద వాహనాలను ఆపి తనిఖీ చేశారు.రోడ్డు భద్రతా చర్యలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సీఐ రఘువీర్ రెడ్డి హెచ్చరించారు. హెల్మెట్ ధరించకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని అన్నారు.వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

You may also like...