ప్రజా ఆరోగ్య పరిరక్షణకు.. ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛ జలధార
- ప్రజా ఆరోగ్య పరిరక్షణకు.. ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛ జలధార - September 25, 2026
- గూడు లేని నిరుపేదలకు ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం - September 25, 2026
- యువతకు సాంకేతిక నైపుణ్యాలు – 5500 మందికి శిక్షణ - September 25, 2026

వెల్దండ సెప్టెంబర్ -25 వెల్దండ మండలం తిమ్మినోని పల్లి గ్రామంలో
త్రాగునీటి నిల్వ ట్యాంకుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతోఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో చేపట్టిన “స్వచ్ఛ జలధార” కార్యక్రమం రెండవ విడతలో భాగంగ వెల్దండ మండలం తిమ్మినోని పల్లి గ్రామంలో త్రాగునీటి నిల్వ ట్యాంకులను పరిశుభ్రపరిచారు.జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో ట్యాంకుల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి పరిశుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో
తిమ్మినోని పల్లి గ్రామ సర్పంచ్ మూడవత్ శారద హరికిషన్ ,డిప్యూటీ సర్పంచ్ గ్రామ ఐక్యత ఫౌండేషన్ ప్రతినిధులు ,వార్డు సభ్యులు , యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.పరిశుభ్రమైన త్రాగునీరు ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు.
