నిరుపేద వైద్య విద్యార్థినికి అండగా నిలిచిన ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్
- ఘనంగా నీలకంఠం పాండు జన్మదిన వేడుకలు - September 25, 2026
- చల్లపల్లిలో బాల భక్త బృందం లడ్డు వేలం – దక్కించుకున్న ఎర్ర జంగయ్య - September 25, 2026
- అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో చిన్న లడ్డు వేలం.. దక్కించుకున్న మనోహర్ - September 25, 2026
. జ్ఞాన తెలంగాణ స్పాట్ న్యూస్ కథనానికి స్పందన 
వెల్దండ సెప్టెంబర్ 24: జ్ఞాన తెలంగాణ స్పాట్ న్యూస్ లో "వైద్యురాలు కావాలని కోరిక.. పేదరికం అడ్డంకి – ఆదుకునే చేతుల కోసం ఎదురు చూపులు" అనే శీర్షికకు బీఆర్ఎస్ నాయకులు జోగయ్య చొరవతో స్పందన లభించింది.ఇటీవల నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ సీటును సాధించిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత ఎంబీబీఎస్ సీటు సాధించింది అయితే వైద్య విద్యకు అవసరమైన ఖర్చులకోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల ట్రస్ట్ చైర్మన్ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పై చదువుల కొరకు విద్యార్థినికి రూ.1,5000 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య,సీనియర్ నాయకులు పూరి రమేష్, చలి చీమల నిరంజన్,జంగిలి ఆనంద్, శివ లింగం తదితరులు పాల్గొన్నారు
