సీఎంతో TGEJAC నేతల భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) నాయకులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో బుధవారం రాత్రి 9 గంటలకు TGEJAC నేతలు సమావేశం కానున్నారు. ఉద్యోగుల సమస్యలు, పెండింగ్‌ డిమాండ్లు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఈ ఆహ్వానంతో ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సమావేశంలో వెలువడే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

You may also like...