వంగూర్ మండల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ

వంగూర్ మండల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు.

నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం (ఐకేపీ బిల్డింగ్)లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

1001338317.jpg

You may also like...