తెల్కపల్లిలో ఉచిత వేరుశెనగ విత్తన పంపిణీ – పాల్గొన్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

తెల్కపల్లి: తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ఉచిత వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య గారు, తెల్కపల్లి మండల అధ్యక్షులు బండ పర్వతాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తపల్లి వినోద్ కుమార్ గారు, రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.1001336536.jpg

You may also like...