వెదురుతో ఆర్థిక వనరులకు బాటలు.. అదనపు కలెక్టర్

1001191412.png

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 18: వెదురు వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ఆర్థిక ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య అన్నారు. అంతర్జాతీయ వెదురు దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వెదురుతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చన్నారు. వెదురు ఆధారిత పరిశ్రమలు, హస్తకళలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

You may also like...