22-A భూములు, ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరపాలి టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ కుమార్ యాదవ్
- జిఎంఆర్ కాలనీ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి - September 19, 2026
- పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలు అందజేత - September 19, 2026
- జీఎంఆర్ కాలనీలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు - September 19, 2026
జనగామ, సెప్టెంబర్ 18: 22-ఏ నిషేధిత భూములు, ప్రభుత్వ, అసైన్డ్ భూములపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమ సమయంలో భూములు లేని కొందరికి పదేళ్లలో వందల ఎకరాలు ఎలా వచ్చాయో లెక్క తేల్చాలని కోరారు. ధరణి రికార్డుల్లో మార్పులు, భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదలాయింపులపై విచారణ జరపాలన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆస్తుల వివరాలను అధికారిక రికార్డులతో పరిశీలించాలని కోరారు. జనగామ, ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
