4 ఎకరాల 04 గుంటల గొర్రెల పెంపకదారుల సంఘం భూమి అక్రమ రిజిస్ట్రేషన్

జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకదారుల సంఘానికి చెందిన 4 ఎకరాల 04 గుంటల భూమిని ఉస్మానియా అగ్రో ఇండస్ట్రీస్ వారు అక్రమంగా, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సంఘ సభ్యులు ఆరోపించారు.

సంఘంలో దాదాపు 60 మంది సభ్యులు ఉన్నారని, ఈ భూమిని గొర్రెల పెంపకదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం గొర్రెల పంపిణీ / వరహాల పథకం కింద కేటాయించిందని తెలిపారు. ఇట్టి భూమికి సర్వే నెం. 582/F లో గల భూమిని తేదీ 08/06/2005 రోజున డాక్యుమెంట్ నెం. 5556/2005 ద్వారా శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకదారుల సంఘం పేరున రిజిస్ట్రేషన్ చేయించామని పేర్కొన్నారు. అయితే తమ సంఘ సభ్యులకు ఎవరికీ తెలియకుండా, తమ ప్రమేయం లేకుండానే తేదీ 02/01/2007 రోజున డాక్యుమెంట్ నెం. 11/2007 ద్వారా ఉస్మానియా అగ్రో ఇండస్ట్రీస్ వారు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకొని దౌర్జన్యంగా భూమిని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమి విషయమై పలుమార్లు వెళ్లి అడగగా తమను బెదిరించారని, ఆ రోజు నుండి నేటి వరకు తమ భూమి కోసం పోరాడుతున్నామని తెలిపారు. కావున సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఫోర్జరీ సంతకాలతో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ పై విచారణ జరిపి, చర్యలు తీసుకొని తమ సంఘ భూమిని తిరిగి తమకు అప్పగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

You may also like...