తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత కెసిఆర్ దే – గిరిజనుల కృతజ్ఞత

1001187695.jpg

వెల్దండ సెప్టెంబర్ 17: వెల్దండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ తండాలలో గురువారం గిరిజనులు తెలంగాణ జాతిపిత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించి గిరిజన ప్రాంతాలకు స్వపరిపాలన అవకాశం కల్పించిన ఘనత కేసీఆర్ దక్కుతుందని గిరిజనులు అభిప్రాయపడ్డారు. మండలంలోని రాంపూర్ తండా, లక్ష్మానాయక్ తండా,భూక్యా తండా, సర్దార్ గిప్పూర్ తండా, చింతల తండా,గోవిందాపూర్ తండా ఇలా మొత్తం 12 తండాలలో ఏకకాలంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.గిరిజన మహిళా నాయకురాలు బానోత్ లక్ష్మి మాట్లాడుతూ కేసీఆర్ మా కోసం ఎన్నో చేశారు. ఇప్పుడు మాకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతున్నాయి. అందుకే మేము రుణపడి ఉన్నాము అని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరిజనులు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ కోలాట నృత్యం చేశారు. కేసీఆర్ హయాంలోనే గిరిజనులకు నిజమైన అభివృద్ధి జరిగిందని, ఆయనే మా జాతిపిత అని గిరిజనులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండల పార్టీ అధ్యక్షులు విజయ్ గౌడ్, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సత్యం, వెల్దండ మండల పార్టీ అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి, నిరంజన్, రాజు నాయక్ పలువులు బారాస నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...