మోకిలలో ఘనంగా వనమహోత్సవం
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింహ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ శేఖర్ పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు పంచాయతీ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు.
