ప్రతీ ఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు
- ప్రతీఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులుతల్లోజు - August 5, 2026 - ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026

ప్రతీ ఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 05 :
కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్యూమరేషన్ దరఖాస్తులను తిరిగి సమర్పించుకునే అవకాశం ఉన్నందున, ప్రతి అర్హులైన ఓటరికి ఈ విషయంపై పూర్తి సమాచారం చేరేలా చూడాలని సూచించారు. బిఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, దరఖాస్తుల సమర్పణలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.ప్రతి బూత్ పరిధిలో బీఎల్వోలు,బీఎల్ఏలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.ప్రజలకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు.
