ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి ప్రతినిధి:
శంకర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్రెడ్డి గ్రామ స్థాయి నాయకులు, సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలం ప్రజల్లోనే ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలే ముందుండాలని, గ్రామ కమిటీలను బలోపేతం చేసి యువత, మహిళలు, రైతులను పార్టీలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసమే పార్టీకి నిజమైన బలమని ఆయన పేర్కొన్నారు.
