సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే వేముల వీరేశం
- ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026
- యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం - August 4, 2026

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే వేముల వీరేశం
23 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 4 : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం, కురుమర్తి, నారెగూడెం, కల్మెర, మాణిక్యాలమ్మగూడెం, మునుకుంట్ల, పరసాని గూడెం, పరడ, ఈదులూరు, అయిటిపాముల, దుగినవెల్లి, మల్లారం గ్రామాలకు చెందిన 23 మందికి మంజూరైన సీఎం రిలీఫండ్ చెక్కులను మంగళవారం నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ండ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నాడని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న, సర్పంచ్లు కురిమిల్ల మల్లేష్, దార సత్తెమ్మ, కొలిపాక సురేందర్, సుంకరబోయిన సంధ్య, గుల్లి నరేష్, మల్లెబోయిన యాదగిరి, నాయకులు పెద్ది సుక్కయ్య, అయితగోని నారాయణ, పాలిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీసీ కార్యదర్శి చింత వెంకటనర్సయ్య, దాసరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
