ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం


జ్ఞాన తెలంగాణ, తలకొండపల్లి ప్రతినిధి,ఆగస్టు 3:
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన మంద శాంతమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణానికి అవసరమైన సిమెంట్, సీకులను రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు.
నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయం అందించినట్లు ఉప్పల వెంకటేష్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణం నిలిచిపోయిన నేపథ్యంలో అందించిన ఈ సహాయం కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందన్నారు.
ఈ సందర్భంగా మంద శాంతమ్మ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ అవసర సమయంలో అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెల్జాల్ గ్రామ సర్పంచ్ వానరాసి రాములమ్మ (ఎం/ఓ వానరాసి వెంకటేష్), ఉప సర్పంచ్ శివ విజయలక్ష్మి, విజయ్ కుమార్, వార్డు సభ్యులు దుళ్ల శ్రీశైలం, వట్టేల శేఖర్, దుబ్బ గణేష్, సంపత్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...