శంకర్ పల్లి మున్సిపల్ 14వ వార్డులో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటున్న గణనాథుడు

1012750813.jpg

శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు, సాయి కాలనీలో రాధాకృష్ణ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటున్నాడు.

వినాయకుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా అలంకరించారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఇందులో భాగంగా శబరీషా భక్త సమాజం, శంకర్‌పల్లి వ్యవస్థాపకులు విష్ణువర్ధన్ రెడ్డి బృందం ఆధ్వర్యంలో భక్తి భజన సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. గణపతి భక్తి పాటలు, అయ్యప్ప భజనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

You may also like...