హత్నూర గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభం

 సంగారెడ్డి :- మండలకేంద్రమైన హత్నూర గ్రామ పరిధిలో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో VBG-RAM-G ప్రోగ్రామ్‌లో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని వృధా చేయకుండా ఒడిసిపట్టడం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయవచ్చని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హత్నూర గ్రామ సర్పంచ్…