శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ 68 వ వర్ధంతి
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ 68 వ వర్ధంతి
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండి చెర్ల గోవర్ధన్ రెడ్డి, పట్టణ ప్రజలు పాఠశాల విద్యార్థులు, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్య దశ నుండి తనకు ఎదురైన ప్రతి సంఘటనను మొత్తం సమాజపరంగా చూసి, దాని మీదే పోరాడే తత్వాన్ని అలవర్చుకున్నాడని,తనతండ్రి యొక్క క్రమశిక్షణతో కూడిన జీవితమే అంబేద్కర్ లో ప్రతి ఫలించిందని, సాధారణంగా చాలామంది వ్యక్తిగత స్వార్థంతో జీవిస్తారు కానీ, ఆయన సామాజిక స్పృహతో జీవించారని స్మరించుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గండిచెర్ల, వెంకటయ్య, రామచందర్, శంకరయ్య , రాజేశ్వర్, చంద్ర శేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభిమానులు పాల్గొన్నారు.

