ఉత్తమ తహసిల్దార్ కు గిరిజన నేతల ఘన సన్మానం
- మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పర్వేద వార్డు మెంబర్ రవి - August 21, 2026
- ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత - August 21, 2026
- మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - August 21, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 21:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్తమ తహసిల్దార్ అవార్డులలో వెల్దండ మండల తహసిల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ నియామక పత్రం అందుకున్నారు.దీంతో శుక్రవారం వెల్దండ మండల గిరిజన సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షులు అజిత్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజాసేవలో తహసిల్దార్ కార్తీక్ కుమార్ చూపిన అంకిత భావానికి ఈ పురస్కారం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు నాగులు నాయక్, నారాయణ నాయక్, శంకర్ నాయక్, గోపాల్ నాయక్,పంతు నాయక్, రమేష్ నాయక్,లాలు నాయక్, జీవుల నాయక్, లాలు నాయక్, జయరాం నాయక్, పలువురు గిరిజన సంఘం నేతలు, ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
