అర్హులకు పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

మేడ్చల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. అట్టివెల్లిలోని జీఎన్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో మేడ్చల్ డివిజన్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన 1,140 పెన్షన్ల ఉత్తర్వులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహులు యాదవ్, సత్యనారాయణ, చాప రాజు, సురేందర్…