మీసేవ సేవలు ఇక ఇంటి వద్దకే..

 ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) శాఖ, సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ‘మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీ’ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్…