నకిలీ ముద్రా రుణాల మోసం.. నలుగురి అరెస్ట్

మల్కాజిగిరి: ఫేస్‌బుక్‌లో నకిలీ ముద్రా రుణ ప్రకటనలతో వ్యాపారిని రూ.4,67,800 మోసం చేసిన నలుగురిని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు సేకరించి ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్ తదితర ఛార్జీల పేరుతో నగదు వసూలు చేసినట్లు గుర్తించారు. నేరానికి ఉపయోగించిన రెండు సెల్‌ఫోన్లు, రెండు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సీపీ బి.సుమతి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ జె.ఎల్. కృష్ణంరాజు బృందం చర్యలు చేపట్టింది….