Category: జిల్లా వార్తలు

నల్ల బ్యాడ్జీలతో మోడల్ స్కూల్ టీచర్ల నిరసన

వెల్దండ,అక్టోబర్ 30 : వెల్దండ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 010 ద్వారా జీతాలు, జీఓ370 అమలు, హెల్త్ కార్డులు, డీఏ బకాయిలు, అవర్ లీ టీచర్లకు గౌరవ వేతనం, ఔట్ సోర్సింగ్ సిబ్బంది రెగ్యులరైజ్ తదితర పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్, టీచర్లు పాల్గొన్నారు.

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. అడుగంటుతున్న భూగర్భ జలాలుఎండుతున్న బోర్లు.. ఎండమావిగా మారుతున్న సాగునీరు.. తాగునీటి కోసం తప్పని తిప్పలువర్షాభావానికి తోడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. రీఛార్జ్‌ కాని భూగర్భ జలాలు.. రైతుల బతుకుల్లో చీకట్లుప్రత్యేక కథనంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 30 : ఒకప్పుడు వర్షం పడితే చాలు.. పొలాల్లో పచ్చదనం పరుచుకునేది. బావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉండేది. చెరువులు, కుంటలు నిండితే గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్షం కోసం…

ఆర్టీసీ బస్సు ఢీకొని మేస్త్రీ దుర్మరణం.. ఇద్దరు కుమార్తెలకు తీరని శోకం

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన బాన్సువాడ మండలంలో చోటుచేసుకుంది. కొత్తబాది గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ (40) మేస్త్రీ పనుల నిమిత్తం బుడిమి గ్రామానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న మహేష్ మృతితో భార్య, ఇద్దరు కుమార్తెలు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు…

అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేత

వెల్దండ అక్టోబర్ 30: వెల్దండ మండలం కొట్ర గ్రామ శివారులో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు.కొట్ర జీపీఓ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ముందస్తు సమాచారం మేరకు పోలీసుల సహకారంతో టిప్పర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది చంద్రశేఖర్, గోపి పాల్గొన్నారు.

ఎనిమిదేళ్ల తర్వాత గౌరారానికి ఆర్టీసీ బస్సు.. విద్యార్థుల హర్షం

తెలకపల్లి అక్టోబర్ 30: తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి ఎనిమిదేళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు పునఃప్రారంభమైంది. గ్రామం నుంచి తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌కు వెళ్లే విద్యార్థులు, ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటూ కిలోమీటరు దూరం నడిచి బస్సు ఎక్కేవారు.ఈ సమస్యను గ్రామ సర్పంచ్ బిరుదు మల్లీశ్వరి–రఘుకుమార్, ఉపసర్పంచ్ బోయ మల్లేష్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే కల్వకుర్తి ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడి బస్సు పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. అనంతరం గ్రామ…

చలో ఢిల్లీ రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా.. తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు

తలకొండపల్లి అక్టోబర్ 30: రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ మాజీ ఎంపిటిసి రాములు ఆరిఫ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణకై ఢిల్లీలో చేపట్టిన పోరాటానికి పూర్తి మద్దతుగా తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదిలాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి తరలివెళ్లారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ మాట్లాడుతూ…..

ఓటు హక్కును ప్రతి గ్రాడ్యుయేట్ వినియోగించుకోవాలి. – సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్.

వెల్లడం అక్టోబర్ 30: గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ పిలుపునిచ్చారు.శుక్రవారం వెల్దండ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. కార్తీక్ కుమార్ కి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు పత్రాలను సర్పంచ్ ఆధ్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవడం తమ బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని తెలిపారు. గ్రామంలోని అర్హులైన పట్టభద్రులందరూ ముందుకు వచ్చి తమ…

రోడ్డు ప్రమాద బాధిత జర్నలిస్టుకు మిత్ర ఫౌండేషన్ ఆర్థిక సాయం

కల్వకుర్తి అక్టోబర్ 30:కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన జర్నలిస్టు, డాన్స్ మాస్టర్ ఏదుల శేఖర్ బైక్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు.ప్రమాదంలో ఆయన కాలికి,తలకు గాయాలు కావడంతో వైద్య చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ఆయన చికిత్స నిమిత్తం ఫౌండేషన్ తరఫున రూ.5,000 ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ ఫౌండర్ కుడుములు చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షుడు కాకుడాల శ్రీకాంత్ నేత, రావూఫ్, శ్రీకాంత్ గౌడ్, నాదిరి తరుణ్,…

మాందాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దోమకొండ సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి వరిధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాందాపూర్ గ్రామ సొసైటీ డైరెక్టర్లు చింతకుంట రాకేశ్…

పెద్దమ్మతల్లి యాదవ గుడి నిర్మాణానికి సర్పంచ్ రూ.1.50 లక్షల విరాళం

వెల్దండ అక్టోబర్ 29 : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి యాదవ గుడి స్లాబ్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కేశమల్ల అనూష కృష్ణ రూ.1,50,116 ఆర్థిక సాయం అందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తన వంతు సహాయంగా ఈ మొత్తాన్ని అందజేశారు.గ్రామంలో ఎవరైనా కులదైవాల ఆలయాల నిర్మాణం చేపడితే తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని సర్పంచ్ అనూష కృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదవ కుల పెద్దలు, యాదవ కమిటీ…