Category: నాగర్‌కర్నూల్

స్వచ్ఛమైన నీరు సంపూర్ణ ఆరోగ్యం.. ఐక్యత పౌండేషన్ లక్ష్యం

వెల్దండ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకమోనికుంట గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ధార కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఐక్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ టెక్నాలజీతో తయారైన ప్రత్యేక యంత్రాలతో నీటి ట్యాంక్ ను ఉప సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో శుభ్రపరిచారు.గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.శుద్ధ జలం అందించి ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నామని,…

దేవాలయాలు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక.. సుంకి రెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 07: తలకొండపల్లి మండలం,దేవుని పడకల్ మరియు పడకల్ గ్రామాల్లో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దేవుని పడకల్ గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కోసం రూ.2,30,000/-రెండు లక్షల ముప్పై వేల రూపాయలు విరాళం అందించారు.ఈ సందర్భంగా…

ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.. కుర్మిద్ద యాదగిరి

వెల్దండ సెప్టెంబర్ 07: తెలంగాణలో 20 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం బాకీ ఉన్న రూ.12 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ వెల్డండ మండల అధ్యక్షులు కుర్మిద్దా యాదగిరి ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలపై విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న తరుణంలో వెల్డండ పోలీసులు ముందస్తుగా ఇంటికి వచ్చి,అరెస్టు చేయడాన్ని బీజేపీ మండల అధ్యక్షులు కురుమీద్దె యాదగిరి తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరసన తెలిపే…

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

వెల్దండ సెప్టెంబర్ 07: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో భాగంగా మండల కేంద్రానికి చెందిన భారీ యాదమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా సోమవారం సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ల సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు….

బాధిత కుటుంబానికి నాగర్ కర్నూల్ డీసీసీ కార్యదర్శి పరామర్శ

వెల్దండ సెప్టెంబర్ 07: వెల్దండ మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండాకు చెందిన గిరిజన నాయకులు లక్ష్మణ్ నాయక్ కుమారుడు ఇటీవల అనారోగ్యం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర నాయకులు, నాగర్ కర్నూల్ జిల్లా పిసిసి కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్ సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రక్షణ ఖర్చులకు గాను రూ….

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బాకీలు చెల్లించాలని బీఆర్ఎస్ ప్రజావాణిలో ఫిర్యాదు

వెల్దండ సెప్టెంబర్ 07: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యతను చెల్లించాలని వెల్దండ మండలంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బారాస పార్టీ అధిష్టానం,మండల పార్టీ అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి ఆదేశాలమేరకు మండల పరిషత్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలోఎంపీడీవో సులోచనకు ప్రజా వాణిలో ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ2500, విద్యార్థినిలకు స్కూటీలు,హామీ మేరకు రైతు…

అక్రమ అరెస్టులతో ధర్మపోరాటాన్ని ఆపలేరు.. బీజేవైఎం

అక్రమ అరెస్టులతో ధర్మపోరాటాన్ని ఆపలేరు.. బీజేవైఎం

*అక్రమ అరెస్టులతో ధర్మ పోరాటాన్ని ఆపలేరు.‌.బీజేవైఎమ్*కల్వకుర్తి సెప్టెంబర్ 07: పేద విద్యార్థులకు రావలసిన ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వాలని శాంతియుతంగా ధర్నాలో పాల్గొనడానికి వెళ్తున్న బీజేవైఎం, బిజెపి నాయకులను తలకొండపల్లి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ మాట్లాడుతూ..ఎన్ని అడ్డంకులు వచ్చిన తెలంగాణ విద్యార్థుల పక్షాన బిజెపి, బీజేవైఎం పోరాడుతుందని, ఫీజుల బకాయిలు చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ విద్యార్థులకు…

ఉప్పల వెంకటేష్ పిలుపుతో బండోనిపల్లిలో కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

వెల్దండ సెప్టెంబర్ 06:రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల పిలుపుతో బండోనిపల్లిలో ఉప సర్పంచ్ అల్వాల్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 1000 రోజులు అయినా 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బాకీ కార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు.ఉపసర్పంచ్ అల్వాల్…

కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదారణ

కల్వకుర్తి సెప్టెంబర్ 06: కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందని,కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ లోని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నివాసంలో కడ్తాల్ మండలంలోని ముద్విన్, గడ్డమీది తాండా గ్రామ పంచాయతీలకు చెందిన పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు…

మృతురాలి కుటుంబానికి భాస్కరరావు ఆర్థిక సహాయం

కల్వకుర్తి సెప్టెంబర్ 06:చారకొండ మండలంలోని గోకారం గ్రామానికిచెందిన పంజుగుల రాములమ్మ ఇటీవల ఆకస్మికంగా మరణించారు.వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు మృతుని కుటుంబానికి భాస్కర్ రావు యువసేన సభ్యుల ద్వారా రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పంజుగుల పరుశరాములు,కొండల్,రషీద్,గజ్జెశ్రీను, వెంకటయ్య,శ్రీను,రవి,అల్లాజీ మహేష్,కరుణాకర్,వెంకటరెడ్డి,లక్ష్మారెడ్డిసాదిక్ అలీ మల్లయ్య, జూపల్లిభాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్,జూపల్లి భాస్కర్ రావుయువసేన సభ్యులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.