కల్వకుర్తి ఎక్సైజ్ సీఐగా రవిచంద్ర రెడ్డి బాధ్యతల స్వీకరణ

కల్వకుర్తి ఎక్సైజ్ నూతన సీఐ గా రవిచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై కల్వకుర్తికి వచ్చిన ఆయనకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన సీఐ వెంకటరెడ్డి బదిలీపై షాద్ నగర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి వేణుగోపాల్ రెడ్డి ని పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ మద్యం అమ్మకాలపై శాఖా పరమైన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

You may also like...