కేశవ నగర్ కాలనీలో సుంకిరెడ్డి హైమాస్ట్ వెలుగులు.!

1001368432.jpg

జ్ఞాన తెలంగాణ ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 16 :కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని కేశవ నగర్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తన సొంత నిధులతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించారు. రాత్రివేళల్లో వెలుతురు లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఈ ఏర్పాట్లు చేపట్టారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రామకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నరేష్ చారి, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, శ్రీనివాస్, వరప్రసాద్, రామకృష్ణ, రాఘవాచారి, కె.రాములు, బి.రాములు, సత్యనారాయణ, విశ్వనాథం, అనంత రాములు, చెన్నయ్య, నరసింహ, బాలు,రామ్మోహన్, లక్ష్మణ్ గౌడ్, ఎన్.శ్రీనివాస్, రాంరెడ్డి శేఖర్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like...