అర్హులకు ఆసరా పింఛన్ల పంపిణీ – సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
- పోలేపల్లి సమస్యలను పరిష్కరించండి సారు – సర్పంచ్ వెంకటయ్య.! - November 16, 2026
- ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం! - November 16, 2026
- అర్హులకు ఆసరా పింఛన్ల పంపిణీ – సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - November 16, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 16 :వెల్దండ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లను గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు,గీత కార్మికులకు పింఛన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అర్హులకు పింఛన్లు అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృషితో అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గిరిగౌడ్, ఉపసర్పంచ్ బస్నమోని శ్రీనివాస్,సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య,వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
