పోలేపల్లి సమస్యలను పరిష్కరించండి సారు – సర్పంచ్ వెంకటయ్య.!
- పోలేపల్లి సమస్యలను పరిష్కరించండి సారు – సర్పంచ్ వెంకటయ్య.! - November 16, 2026
- ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం! - November 16, 2026
- అర్హులకు ఆసరా పింఛన్ల పంపిణీ – సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - November 16, 2026

ఆమనగల్ నవంబర్ 16 :ఆమనగల్లు మండల అభివృద్ధి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పోలేపల్లి సర్పంచ్, మండల సర్పంచుల సంఘం కార్యదర్శి వెంకటయ్య కోరారు. ఆదివారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జయరాం విజయ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన పోలేపల్లి గ్రామ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్ చైర్మన్ గూడూరు శ్రెరీనివాస్ డ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలేపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం, 25 విద్యుత్ స్తంభాల మంజూరు, అంగన్వాడీ టీచర్ పోస్టు భర్తీ, నూతన గ్రామపంచాయతీ ప్రొసీడింగ్ పత్రాల జారీ,గతంలో మంజూరైన సీసీ రోడ్ల పనుల కేటాయింపుపై వెంకటయ్య ప్రస్తావించారు.అలాగే పశువైద్యశాల, గ్రంథాలయం,పీహెచ్పీ ఆసుపత్రి మంజూరు చేయాలని,పోలేపల్లి నుంచి కలకొండ శివారు వరకు ఉపాధి హామీ పథకం కింద కంకర రోడ్డు నిర్మించాలని కోరారు.అర్హులైన మరో నలుగురికి పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.గత మూడు సమీక్ష సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంపై సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి శాఖకు చెందిన అధికారులు సమావేశాలకు తప్పనిసరిగా హాజరై సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు రామంతుల శ్రీనునాయక్, మంగళపల్లి సర్పంచ్ మౌనిక,చింతలపల్లి సర్పంచ్ యాదయ్య, కొత్తకుంట తండా సర్పంచ్ పత్య, కోనాపూర్ సర్పంచ్ శ్రీలత, మేడిగడ్డ సర్పంచ్ రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు,గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
