వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.!

1001365342.jpg

వెల్దండ నవంబర్ 15 :గతంలో వెల్దండ మండలంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన ప్రస్తుతం దేవరకొండ సీఐగా విధులు నిర్వహిస్తున్న నర్సింహులు ఆదివారం మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి ఆత్మీయంగా అభినందించారు.గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ చేస్తున్న కృషి, చూపుతున్న చొరవ అభినందనీయమని ఎస్సై నరసింహ్మ పేర్కొన్నారు. గతంలో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్సైగా నరసింహ్మ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ,నేటికీ ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ కలవడం సంతోషంగా ఉందని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్, బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్, ఆలీ బాబా తదితరులు పాల్గొన్నారు.

You may also like...