అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం – సర్పంచ్ అన్వర్ పాషా
- వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.! - November 15, 2026
- కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్ల అభ్యంతరం.! - November 15, 2026
- అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి! - November 15, 2026

వెల్దండ నవంబర్ 15:కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎంపికైన 13 మంది లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు పంపిణీ చేశారు. కల్వకుర్తిలోని సీకేటీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ అన్వర్ పాషా, పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అన్వర్ పాషా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ తమ కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు.
