ఐక్యంగా ఉద్యమించాలి: జిల్లా సంయుక్త కార్యదర్శిగా యామంకి విజయ్ నియామకం

రజకుల హక్కులు, సంక్షేమం, విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక పిలుపునిచ్చారు. జనగామ జిల్లా అధ్యక్షుడు ఏదునూరి నరేష్ రజక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రజకుల సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శిగా యామంకి విజయ్‌ను నియమించారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ రజకుల హక్కుల సాధనకు కృషి చేస్తానని విజయ్ తెలిపారు. సిద్ధిపేటలో జరిగే సమితి నాలుగో రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

You may also like...