రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all)
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూముల విక్రయాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై పంజాల జైహింద్ గౌడ్ (63)పై పోలీసులు 2026 నవంబర్ 13న పీడీ యాక్ట్ ప్రయోగించారు. రాంపల్లిలో వివాదాస్పద భూమిలో అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేసి, హక్కులు సక్రమంగా ఉన్నాయని నమ్మించి ప్లాట్లు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో 2026లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయనను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. భూములు కొనుగోలు చేసే ముందు హక్కులు, పత్రాలు పరిశీలించాలని సీపీ బి. సుమతి హెచ్చరించారు.
