ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.. విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసిన సర్పంచ్ వెంకటయ్య .!
- మహిళలకు దక్కని గౌరవం! పెన్షన్ పత్రాల పంపిణీలో కుర్చీల కొరత.. నేలపైనే మహిళల నిరీక్షణ! - November 14, 2026
- పింఛన్ లబ్ధిదారుల ఇంట వెలుగులు.. అర్హులందరికీ ప్రభుత్వ భరోసా: ఎమ్మెల్యే కసిరెడ్డి.! - November 14, 2026
- పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు.. గ్రామాభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - November 14, 2026

ఆమనగల్లు,నవంబర్ 14: నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పోలేపల్లి గ్రామ సర్పంచ్ జంతుక వెంకటయ్య అన్నారు.జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆమనగల్లు మండలం పోలేపల్లి గ్రామంలోని యూపీఎస్ పాఠశాల ఆవరణలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ జంతుక వెంకటయ్య విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలతో మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, ఉపసర్పంచ్ బుచ్చిరెడ్డి, ఉపసర్పంచ్ అంజన్ రెడ్డి, వార్డు సభ్యులు చిన్న జంగయ్య, కృష్ణయ్య, అలివేలు, మాజీ వార్డు సభ్యుడు శ్రీశైలం, ప్రధానోపాధ్యాయుడు సుభాష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
