ఎదురుచూపులకు తెర.. 4,203 మందికి పింఛన్ పండుగ! రేపు ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో పెన్షన్ పత్రాల పంపిణీ.!
- ఘనంగా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు బాలస్వామి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు.! - November 13, 2026
- ఎదురుచూపులకు తెర.. 4,203 మందికి పింఛన్ పండుగ! రేపు ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో పెన్షన్ పత్రాల పంపిణీ.! - November 13, 2026
- పోతేపల్లిలో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.! - November 13, 2026

ఆమనగల్లు,నవంబర్ 13:ఎంతోకాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త. కల్వకుర్తి నియోజకవర్గంలో శనివారం పింఛన్ల పండుగ జరగనుంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేతుల మీదుగా మొత్తం 4,203 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్ పత్రాలను పంపిణీ చేయనున్నారు.ఉదయం 10 గంటలకు మాడ్గుల మండలం నర్సాయిపల్లిలో ఆకస్మికంగా మృతి చెందిన మాజీ ఎంపీటీసీ కొత్త పాండు గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, సంస్మరణ సభలో పాల్గొంటారు. 10:30 గంటలకు ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.ఉదయం 11 గంటలకు ఆమనగల్‌లోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో ఆమనగల్ మున్సిపాలిటీ, ఆమనగల్, కడ్తాల్,మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన 2,500 మందికి పింఛన్ పత్రాలు పంపిణీ చేస్తారు.అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కల్వకుర్తిలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్‌లో వెల్దండ, కల్వకుర్తి, చారకొండ మండలాలు, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని మరో 1,703 మందికి పింఛన్ పత్రాలు అందజేస్తారు.ఈ రెండు కార్యక్రమాల ద్వారా మొత్తం 4,203 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందనున్నాయి. సంబంధిత ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని కోరారు.
