మొయినాబాద్ సదర్ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

1001354756.jpg

రంగారెడ్డి నవంబర్ 12: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని కాశీనాథ్ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన సదర్ సమ్మేళనానికి కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ జైపాల్ యాదవ్ మరియు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా యాదవ సోదరులు నిర్వహించిన సదర్ సమ్మేళనంలో పాల్గొని వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మొయినాబాద్ సదర్ కమిటీ సభ్యులు, అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో యాదవ సోదరులు పాల్గొన్నారు.

You may also like...