గుడుంబా స్తావారాలపై పోలీసుల దాడులు

వెంకటాపురం: నిషేధిత గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నూగూరు వెంకటాపురం సీఐ ముత్యం రమేష్ నేతృత్వంలో వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామ శివారులోని మూడు ప్రాంతాల్లో సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా 48 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 9,600 లీటర్ల బెల్లం వాష్‌ను ధ్వంసం చేశారు. 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్సైలు తిరుపతి రావు, తిరుపతి రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...