జనగామలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
- జనగామలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు - November 12, 2026
- విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన కలెక్టర్.. ఘనంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం - November 12, 2026
- ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి - November 12, 2026

జనగామ పరిసర ప్రాంతాల్లో వరుస వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి తొమ్మిది మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ముందుగా వాహనాలు పార్క్ చేసిన ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, వైర్లను కట్టర్తో కట్ చేసి బైకులను దొంగిలించేవారు. గత నెల 28న హైదరాబాద్ నుంచి జనగామకు వచ్చిన వీరు మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో పార్క్ చేసిన ఆటోతో పాటు పల్సర్ బైక్ను అపహరించారు.ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జనగామ చౌరస్తాలోని అమ్మ టిఫిన్ సెంటర్ వద్ద ఎస్ఐ టి. సుమన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన బీఆర్ నాగరాజు యాదవ్ అలియాస్ అభిషేక్ యాదవ్, మువ్వా అమర్లను అదుపులోకి తీసుకుని విచారించగా వాహన దొంగతనాల విషయం వెలుగులోకి వచ్చింది.వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచనల మేరకు ఏసీపీ భీమ్ శర్మ, సీఐ పి. సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో నిందితులను అరెస్ట్ చేశారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్, డీసీపీ అభినందించారు.
