రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 11: గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడా ప్రతిభకు కొదవ లేదని నిరూపించాడు కట్టంగూర్ మండలం దుగినవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఏనుగుల గోపాలకృష్ణ. ఈ నెల 11న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా జూనియర్ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్‌-14 వాలీబాల్ ఎంపిక పోటీల్లో గోపాలకృష్ణ పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. దుగినవెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గోపాలకృష్ణ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణతో పాటు ఉపాధ్యాయులు మురళయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసరావు, సలీం, రాంకోటి, కరుణాదేవి, సరిత, వ్యాయామ ఉపాధ్యాయుడు ఐతగోని సైదులుగౌడ్ హర్షం వ్యక్తం చేసి అభినందించారు.1000413445.jpg

You may also like...