సింగిల్ విండో డైరెక్టర్ కర్నాటి భగవాన్ రెడ్డికి ఘన సన్మానం
- ప్యాకేజీలు పాచిపోయిన లడ్డూలు మాకొద్దు.! మా భూమిలే మాకు ముద్దు.! - November 10, 2026
- జూపల్లిలో ఘనంగా భాస్కర్ రావు జన్మదిన వేడుకలు - November 10, 2026
- ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. పేదల కల సాకారం – ఎమ్మెల్యే కసిరెడ్డి - November 10, 2026

ఆమనగల్లు ప్రతినిధి నవంబర్ 10: ఆమనగల్లు మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కర్నాటి భగవాన్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ పదవికి ఎన్నిక కావడం సంతోషకరమని, రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు అర్హులైన ప్రతి రైతుకు చేరేలా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అంజన్ రెడ్డి, రవి ప్రకాష్, వార్డు సభ్యులు చిన్న జంగయ్య, సాయిబాబు, డీలర్ శ్రీశైలం, గండికోట శ్రీను, కృష్ణారెడ్డి, మాధవరెడ్డి, గండికోట ఈదయ్య, రాజు, తిరుమలేష్, భాస్కర్, ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్యతో పాటు పలువురు రైతులు, యువకులు పాల్గొన్నారు.
