కావలి వెంకటయ్య అరెస్టును ఖండించిన ఎండి సిరాజ్..!
- పీఏసీస్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కు ఘన సన్మానం..! - November 9, 2026
- ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య - November 9, 2026
- కావలి వెంకటయ్య అరెస్టును ఖండించిన ఎండి సిరాజ్..! - November 9, 2026

ప్రతినిధి,నవంబర్ 9 :కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రశ్నిస్తే అరెస్టులతో అడ్డుకుంటారా అని చారకొండ మండల వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎండి సిరాజ్ తీవ్రంగా మండిపడ్డారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి కావలి వెంకటయ్య వికలాంగులకు ప్రభుత్వం ఇస్తున్న రూ.4000 పెన్షన్ ను రూ.6000 కు పెంచుతామని ఇచ్చిన మాట తప్పిన నేపథ్యంలో, కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కల్వకుర్తి పోలీసులు వెంకటయ్యను అరెస్టు చేసిన విధానాన్ని సిరాజ్ ఖండించారు.ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ..ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టులతో వికలాంగుల గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు.
