పండగను పక్కన పెట్టి ప్రజల కోసం..! బోరు మోటారు బిగించి ఊరికి నీరిచ్చిన చెరుకూరు సర్పంచ్ శ్రీనివాసులు..!

1001342485.jpg

వెల్దండ,నవంబర్ 08 :పండుగ వేళ ఏ ప్రజాప్రతినిధులైనా తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య గడుపుతారు. కానీ వెల్దండ మండలం చెరుకూరు గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పండగను సైతం లెక్కచేయకుండా ముందస్తు నీటి ఎద్దడికి చర్యలు ముమ్మరం చేశారు.గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తడంతో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా రంగంలోకి దిగి బోరు మోటారుకు మరమ్మత్తులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండలు పాల్గొన్నారు.బోరు మోటార్లను మరమ్మత్తు చేసి తిరిగి బిగించడంతో గ్రామంలో తాగునీటి సరఫరా తిరిగి పునరుద్ధరించబడింది. దీంతో తాగునీటి కష్టాలు తీరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ శ్రీనివాసులును అభినందించారు.పండగ రోజు కూడా ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి స్పందించిన సర్పంచ్ తీరుపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

You may also like...