ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి
- పీఏసీస్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కు ఘన సన్మానం..! - November 9, 2026
- ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య - November 9, 2026
- కావలి వెంకటయ్య అరెస్టును ఖండించిన ఎండి సిరాజ్..! - November 9, 2026

కల్వకుర్తి, నవంబర్ 08: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దీపావళి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొడంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయన జన్మదినం, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం ఎంపీ మల్లు రవితో కలిసి కల్వకుర్తి, ఆమనగల్ పట్టణాల్లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ముచ్చటించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నియోజకవర్గంలో పలు శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాలు, పట్టణాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నా
రు.
