భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం

కామారెడ్డి జిల్లాలో బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ ఆధ్వర్యంలో నూతన జిల్లా కమిటీ నియామకం. అనుబంధ విద్యార్థి సంఘమైన భారతీయ విద్యార్థి మోర్చా (BVM) కామారెడ్డి జిల్లా నూతన కమిటీని నియమించడం జరిగింది. బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గంగారం, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు.

ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్‌ను, జిల్లా కో-కన్వీనర్‌గా భానుప్రసాద్‌ను నియమించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “నా చదువు – నా సమాజం కోసం” అనే నినాదంతో భారతీయ విద్యార్థి మోర్చా సమాజంలోని అసమానతలపై విద్యార్థులను చైతన్యపరుస్తూ పనిచేస్తుందని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనా విధానాలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా బీవీఎం నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.
నూతనంగా జిల్లా కన్వీనర్‌, కో-కన్వీనర్ బాధ్యతలు స్వీకరించిన రోహిత్, భానుప్రసాద్‌లకు నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రోహిత్, భానుప్రసాద్ మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం గళమెత్తుతూ, విద్యార్థుల హక్కుల సాధన కోసం అంకితభావంతో పోరాటం చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీవీఎం కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్, కో-కన్వీనర్ భానుప్రసాద్, కమిటీ సభ్యులు సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...