పౌర హక్కుల తో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాలి
- పౌర హక్కుల తో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాలి - September 30, 2026
- మోమిన్ పేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వ సభ్య సమావేశం - September 30, 2026
- పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి - September 29, 2026
పౌర హక్కులతో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుని పై ఉందని మోమిన్ పేట తహసిల్దార్ మునిరుద్దీన్, పేర్కొన్నారు బుధవారం మండల పరిధిలోని దుర్గం చెరువు గ్రామంలో పౌర హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ హక్కుల తో పాటు అవగాహన కల్పించుకొని గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు, మోమిన్ పేట ఎస్ఐ భరత్ భూషణ్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి న్యాయమైన హక్కుల కోసం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య మోహన్, ఎస్సీ బాలుర వసతి గృహ వార్డెన్ తుల్జారామ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, గ్రామ ఉప సర్పంచ్ లాల్ మొహమ్మద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటయ్య, మల్లికార్జున దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్, రమేష్ పటేల్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గ్రామంలోని యువకులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు

