పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 9నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహిస్తున్న పోషణ్ మహ్ లో బాగంగా గర్భిణులు, బాలింతలకు పోషకహారా ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ CDPO జయశ్రీ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు ఆకుకూరలు,పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలు రోజువారి ఆహారంలో బాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుశీల, లక్ష్మీ మహిళలు పాల్గొన్నారు.

You may also like...